తిరుమలకు పోటెత్తిన భక్తులు
NEWS Sep 30,2025 09:45 am
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారిని 81 వేల 626 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 304 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.