ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మహిళల వన్డే వరల్డ్ కప్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. అస్సాంలోని గుహావటిలో మధ్యాహ్నం 3 గంటలకు తొలి మ్యాచ్ భారత మహిళా జట్టు శ్రీలంక జట్టుతో తలపడనుంది. ఈ సందర్బంగా ఇటీవలే మరణించిన గాయకుడు జుబీన్ గార్గ్ కు నివాళులు అర్పించనుంది బీసీసీఐ.