నవంబర్ నుంచి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం
NEWS Sep 30,2025 07:54 am
ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వచ్చే నవంబర్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు. ట్రూడౌన్ విధానంతో యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని కారణంగా రూ. 923 కోట్ల భారం తగ్గనుందని, దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.