టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన చివరి రోజు సాధారణ ప్రయాణీకుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆయన కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్నారు. ఎక్కువ కాలం ఆయన ఎండీగా పని చేశారు. కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. టెక్నాలజీని ఆర్టీసీకి అనుసంధానం చేసేందుకు దృష్టి సారించారు. తోటి ప్రయాణీకులతో సంభాషించారు. తనను ప్రభుత్వం సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించింది. ఆయన స్థానంలో నాగిరెడ్డిని నియమించింది.