పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సూపర్
NEWS Sep 30,2025 07:25 am
మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ తమ కుటుంబంతో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు. ఈ సందర్బంగా చిత్రం సూపర్ గా ఉందంటూ కితాబు ఇచ్చారు తండ్రీకొడుకులు. ఎక్స్ వేదికగా స్పందించారు. వీరితో పాటు చిత్ర బృందం కూడా ఉంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మించగా సుజిత్ దర్శకత్వం వహించారు.