కామారెడ్డిలో ఘనంగా సద్దుల బతుకమ్మ
NEWS Sep 30,2025 09:32 am
కామారెడ్డి: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ హైస్కూల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందు ప్రియా పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలు కోలాటాలు ఆడి ఉత్సవాన్ని మరింత ఉల్లాసంగా మార్చారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మహిళలకు బహుమతులు అందజేశారు.