తెలంగాణ బతుకమ్మ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. సరూర్ నగర్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో 63 అడుగులు ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఒకే చోట, ఒకే సారి 9,292 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను ఆడి 2 గిన్నిస్ రికార్డులు సృష్టించారు. కేరళలో ఒకే రోజున 5,211 మంది మహిళలు ఓనం పండుగను జరుపుకోవడం ప్రపంచ రికార్డు. దీన్ని బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించి చరిత్ర సృష్టించింది.