ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
NEWS Sep 29,2025 07:35 pm
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడుతున్నారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతున్నారు.