ఘనంగా గరుడ సేవ భేష్ : సీఎం
NEWS Sep 29,2025 07:00 pm
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహన సేవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు టీటీడీని అభినందించారు సీఎం చంద్రబాబు. ఈ సేవకు ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ బోర్డుకు, దేవస్థానం అధికారులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు, ఆ శాఖ సిబ్బందికి కంగ్రాట్స్ తెలిపారు. భక్త కోటికి ధన్యవాదాలు తెలిపారు సీఎం.