బల్క్ డ్రగ్‌పార్క్ విషయంలో మత్స్యకారుల ఆందోళనపై స్పందించారు హోంమంత్రి అనిత. బయట వ్యక్తులు వచ్చి మత్స్యకారులను రెచ్చగొట్టారని ఆరోపించారు. మత్స్యకారులతో రాజకీయాలు చేయవద్దన్నారు. 16 రోజులుగా మత్స్యకారులు ధర్నా చేస్తున్నారని అన్నారు. సమస్య పరిష్కారం కోసం రాజయ్యపేట రావాలని మత్స్యకారులు కోరారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడికివచ్చానని చెప్పారు. హెటిరో కంపెనీతో రాజయ్యపేట గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు .