ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. వారంలో రెండుసార్లు సంతకాలు చేయాలని పేర్కొంది. లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.