లా సెక్రటరీ దృష్టికి జూ.అడ్వకేట్స్ డిమాండ్స్
NEWS Sep 29,2025 07:09 pm
తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీకృష్ణ రాష్ట్ర లా సెక్రటరీ పాపి రెడ్డిని కలిసి న్యాయవాదుల డిమాండ్లు వినిపించారు. న్యాయవాదులపై తరచుగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు ₹15,000 స్టైపెండ్ వెంటనే విడుదల చేయాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇతర అంశాలను కూడా చర్చించగా, లా సెక్రటరీ సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామం రాష్ట్ర న్యాయవాదులకు ఉత్సాహాన్నిచ్చే పరిణామంగా వంశీకృష్ణ పేర్కొన్నారు.