పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: SI అనిల్
NEWS Sep 29,2025 07:03 pm
ఇబ్రహీంపట్నం: రాబోయే దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సబ్–ఇన్స్పెక్టర్ అనిల్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానిత షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. దసరా పండుగను శాంతియుత వాతావరణంలో ఘర్షణలు లేకుండా జరుపుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన, ఎవరైనా అల్లర్లు లేదా అవాంఛనీయ చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.