మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛతపై అవగాహన
NEWS Sep 29,2025 07:01 pm
మెట్‌పల్లి: మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, ప్రతి ఒక్కరు ఏటా 100 గంటలు లేదా వారానికి 2 గంటల పాటు స్వచ్ఛత కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మన వీధులు, చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలి. చెత్తను మురికికాలువల్లో గాని రోడ్లపై గాని వేయరాదు. ప్రజలకు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో కార్మికులు ముందుండాలి” అని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.