స్థానిక ఎన్నికల్లో వాళ్లకు బిగ్‌షాక్!
NEWS Sep 29,2025 01:35 pm
ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని, గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినా దాన్ని అమలు చేయకపోవడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీచేసే అవకాశం కల్పిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. తెలంగాణలో ముగ్గురు పిల్లల నిబంధనలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు, అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగినవారు కూడా పోటీచేయొచ్చు.