స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
NEWS Sep 29,2025 11:13 am
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా 2 దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న మొదటి దశ, అక్టోబర్ 27న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ పోలింగ్ తేదీలు అక్టోబర్ 30, నవంబర్ 4, నవంబర్ 8. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.