దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ ను ఓడించింది. కప్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా ఛాంపియన్ గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ 150 పరుగులు చేసి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ , శాంసన్, శివమ్ దూబే రాణించడంతో ఇండియా గెలుపొందింది.