జాతర మహోత్సవం లో పాల్గొన్న సుజిత్ రావు
NEWS Sep 28,2025 08:05 pm
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఆదివారం బోనాల జాతర సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించి బోనం ఎత్తుకున్నారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం, మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు ఉన్నారు.