అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలోకి నో ఎంట్రీ
NEWS Sep 28,2025 07:42 pm
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంలో రేపటి నుంచి విచారణ చేపట్టనుంది అసెంబ్లీ ట్రిబ్యునల్.ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ బులెటిన్ విడుదల చేసింది. అనుమతి లేనిదే అసెంబ్లీలోకి అనుమతి ఇచ్చేది లేదని పేర్కొంది. విజిటర్లు, మీడియాతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ముందస్తు అనుమతి ఉంటేనే అసెంబ్లీ బిల్డింగ్ లోకి ఎంట్రీ ఉంటుందని, మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది. అక్టోబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.