పాపం.. రెండేళ్ల చిన్నారి చనిపోయాడు!
NEWS Sep 28,2025 06:52 pm
విజయ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో లోకం తెలియని పసి చిన్నారులు కూడా ప్రాణాలు వదలడం కన్నీళ్లు పెట్టిస్తోంది. తమ అభిమాన నటుడు, నాయకుడిని చూసేందుకు తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చారు. రెండేళ్ల దురు విష్ణు అనే బాలుడి నుదుటికి TVK కండువా చుట్టి సంబరపడ్డారు. కానీ తొక్కిసలాట రూపంలో వచ్చిన మృత్యువు ఆ పిల్లాడిని బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మైనర్లు చనిపోయారు. మృతుల్లో పిన్న వయస్కుడు విష్ణునే.