న్యాయవాదుల న్యాయ దీక్ష విజయవంతం
NEWS Sep 28,2025 06:42 pm
ధరణీచౌక్, ఇంద్రాపార్క్‌లో తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జక్కుల వంశీ కృష్ణ నిర్వహించిన న్యాయవాదుల న్యాయ దీక్ష ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ ఆర్. కృష్ణయ్య, జస్టిస్ చంద్రకుమార్, వి. హనుమంత్‌రావు, ఎమ్మెల్యే కౌసర్ మోహిన్ ఉద్దీన్ హాజరై సంఘానికి మద్దతు తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు, జూనియర్ అడ్వకేట్‌లకు ₹15,000 స్టైఫండ్ మంజూరు. 41A CrPC (35(3) BNSS) సవరణ, కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల జారీ.. వంటి డిమాండ్స్ చేశారు.