ఛాన్స్ ఇస్తే హైద్రాబాద్ ను న్యూయార్క్ చేస్తా
NEWS Sep 28,2025 05:03 pm
నాకు పదేళ్లు అవకాశం ఇస్తే న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తానని అన్నారు. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదని ప్రశ్నించారు. . ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం అన్నారు. బుల్లెట్ ట్రైన్ తీసుకు రావడానికి కేంద్రాన్ని ఒప్పించామన్నారు. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగి నష్ట పోవొద్దన్నారు.