వడ్డాది అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
NEWS Sep 28,2025 06:46 pm
అనకాపల్లి: శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. “అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని తాతయ్యబాబు అన్నారు. వడ్డాది టీడీపీ పట్టణ అధ్యక్షులు దొండా నరేష్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.