ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
NEWS Sep 28,2025 06:44 pm
వడ్డాది: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, టీడీపీ అధ్యక్షులు వడ్డాది టౌన్ టీడీపీ కార్యాలయంలో భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాతయ్యబాబు మాట్లాడుతూ, “స్వాతంత్య్రం కోసం చిన్న వయసులోనే భగత్‌సింగ్ ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన వైనం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి కావాలి” అన్నారు. వడ్డాది టౌన్ టీడీపీ అధ్యక్షులు దొండా నరేష్, తలారి శంకర్, సాయం రాజశేఖర్, ఆకుల ఫౌండేషన్ అధినేత ఆకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.