ఘటనకు కారణం తెలిపిన డీజీపీ
NEWS Sep 28,2025 03:42 pm
నిజానికి సభకు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉందని, కానీ పార్టీ అధికారిక X ఖాతాలో విజయ్ మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని ప్రకటించారని డీజీపీ తెలిపారు. "ఈ ప్రకటనతో ఉదయం 11 గంటల నుంచే ప్రజలు రావడం మొదలుపెట్టారు. కానీ విజయ్ వచ్చింది రాత్రి 7:40 గంటలకు. గంటల తరబడి ఎండలో సరైన ఆహారం, నీరు లేకుండా ఎదురుచూడటంతో జనం తీవ్ర అసహనానికి గురయ్యారు" అని ఆయన అన్నారు. అయితే, తొక్కిసలాటకు కచ్చితమైన కారణం ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు.