కృష్ణా నదికి పోటెత్తిన వరద
NEWS Sep 28,2025 12:42 pm
ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.02 లక్షల క్యూసెక్కులు ఉండగా 6.5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుర్గమ్మ శరన్నవరాత్రులకు విజయవాడ వచ్చే భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని పేర్కొన్నారు.