ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో ఛేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును అరకు కాఫీ దక్కించుకుంది. ఈ సందర్బంగా స్పందించారు సీఎం చంద్రబాబు. అవార్డు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు. రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని పేర్కొన్నారు. . ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించారని అన్నారు. గిరిజన కో-ఆపరేటీవ్ కార్పోరేషన్ ను అభినందించారు.