కరూర్ ఘటనపై పీవీఎన్ మాధవ్ దిగ్భ్రాంతి
NEWS Sep 28,2025 08:55 am
కరూర్ లో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. మృతుల్లో చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించిందన్నారు.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నానని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.