కరూర్ ఘటనకు విజయ్ బాధ్యుడు
NEWS Sep 28,2025 08:39 am
తమిళనాడు డీజీపీ వెంకట రామన్ సంచలన ప్రకటన చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు. 10 వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చామని, కానీ 27 వేల మందికి పైగా హాజరయ్యారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన విజయ్ రాత్రి 7 గంటలకు వచ్చారని ఆరోపించారు. ఒక్కసారిగా జనం పెరగడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.