రామగుండంలో ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ సంబురం
NEWS Sep 28,2025 09:41 am
తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగను శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించారు. "స్వచ్ఛతా హీ సేవా"లో భాగంగా జరిగిన ఈ వేడుకలో మహిళా సమాఖ్యలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్తీక దీపం, శాంతి, వెన్నెల సమాఖ్యలు ఉత్తమ బహుమతులు పొందగా, ఇతర సమాఖ్యలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. కమిషనర్ అరుణశ్రీ సహా అధికారులు బతుకమ్మ ఆడి మహిళలను ఉత్సాహపరిచారు.