మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
NEWS Sep 28,2025 03:45 pm
మంథని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ పండుగను ఆనందంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబించే ఈ ఉత్సవంలో మున్సిపల్ AE మౌనిక, మెప్మా CO లావణ్య, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ మహిళా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పుష్పాలతో అలంకరించిన బతుకమ్మలను, పాటలతో సంప్రదాయాన్ని పునరుద్ఘాటించారు. ఈ వేడుక మహిళల్లో ఉత్సాహాన్ని నింపింది