సుల్తానాబాద్‌లో బతుకమ్మ సందడి
NEWS Sep 28,2025 03:47 pm
సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగినులు, మెప్మా సిబ్బంది పూలతో అలంకరించిన బతుకమ్మలతో సంప్రదాయ పాటలు పాడుతూ వలయాకారంగా నృత్యం చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై, బతుకమ్మ పండుగ హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేశ్, అధికారులు, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు.