ఫైనల్లో భారత్-పాక్ బిగ్ ఫైట్!
NEWS Sep 27,2025 11:24 pm
దుబాయ్ వేదికగా నేడు (ఆదివారం) ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఫైనల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్, అందులోనూ ఆపరేషన్ సిందూర్ తర్వాత 2 దేశాల రాజకీయ, భౌగోళిక పరిస్థితులు హీటెక్కన నేపథ్యంలో జరుగుతున్న మెగా ఫైట్. ఆసియా కప్‌లో భారత్- పాకిస్థాన్ కలిసి ఇంత వరకు ఫైనల్లో ఆడలేదు. ఇరు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి.