'మీట్ ది పీపుల్' నినాదంతో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్.. ప్రతి శనివారం 2 జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. నేడు నామక్కల్, కరూర్‌లలో పర్యటిస్తుండగా తీవ్ర విషాదం జరిగింది. ఐతే, విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం ప్రతి వారం వివాదానికి దారి తీస్తోంది. పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు సభ జరిగింది. 10 వేల మంది వస్తారని అంచనా వేసుకుంటూ 2 లక్షల మంది రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది.