స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
NEWS Sep 27,2025 09:47 pm
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్‌ను పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతినిధులు తెలిపిన ఆక్షేపణలను పరిశీలించి నివృతి చేసినట్లు స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.