CMRF చెక్కులను పంపిణీ చేసిన సుజిత్ రావు
NEWS Sep 27,2025 09:22 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సీఎం సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు లబ్ధిదారులకు అందజేశారు. రూ.4 లక్షల 16 వేల విలువగల 10 చెక్కులు ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి రుత్త నారాయణ, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి అందే మారుతి, మెట్‌పల్లి మైనారిటీ మాజీ పట్టణ అధ్యక్షులు కుతుబుద్దీన్ పాషా, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొడిమ్యాల తదితరులు పాల్గొన్నారు.