కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
NEWS Sep 27,2025 09:20 pm
జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు.