జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
NEWS Sep 27,2025 06:59 pm
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని జిల్లాల వారీగా జడ్పీ చైర్మన్‌ల రిజర్వేషన్ వివరాలు వెల్లడించింది. ఎస్టీలకు ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కేటాయించింది. ఎస్సీలకు సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, జనగామ, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలు కేటాయించగా బీసీలకు సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, వనపర్తి, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మంచిర్యాల జిల్లాలను కేటాయించింది. జనరల్ కేటగిరీ కింద పెద్దపల్లి, జగిత్యాల, నారాయణ పేట, కామారెడ్డి, మెదక్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వర్తింప చేసింది.