తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా టూరిజంకు ఒక పాలసీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకు వచ్చామన్నారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి జూపల్లిని అభినందిస్తున్నానని అన్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా తెలంగాణకు ఉందన్నారు.