విత్తనాల మోసం రైతుల ఆగ్రహం
NEWS Sep 27,2025 01:15 pm
మెట్ పల్లి పట్టణంలో రైతులు ఆందోళనకు దిగారు. శ్రీ లక్ష్మి ఫార్టిలైజార్ షాప్ జూలై నెలలో 45 మందిమి విత్తనాలు కొనుగోలు చేశామని, పొలాల్లో వేస్తే మొలకెత్తలేదని, మోస పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫిర్యాదు తీసుకున్నారని కానీ ఇప్పటి వరకు స్పందించ లేదన్నారు. పోలీసులు రైతులను బుజ్జగించి సోమవారం వరకు సమస్యను పరిష్కరించేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.