డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దెబ్బ
NEWS Sep 27,2025 05:52 pm
నల్గొండ-రంగారెడ్డి జిల్లా మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. మూడింట రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎమ్మెల్యే మందుల సామేల్ బలపరిచిన ప్రవీణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. వేముల వీరేశం సపోర్ట్ చేసిన జయశ్రీ విజయం సాధించగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన లక్ష్మీ నరసింహా రెడ్డి, భాస్కర్ గౌడ్ విక్టరీ నమోదు చేశారు.