ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
NEWS Sep 27,2025 05:48 pm
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన చేశామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బిల్లును కేంద్రానికి పంపితే పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇతర సామాజిక వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఇది ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, సమాజంలో సమానత్వం కోసం తీసుకున్న ఓ గొప్ప నిర్ణయమన్నారు.