స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొందరు వేరే వ్యక్తులతో కోర్టులో కేసులు వేయించి బీసీ రిజర్వేషన్ల ను అడ్డుకోవాలని చూస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు.