కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం
NEWS Sep 27,2025 05:42 pm
కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు కలిశారు. కురుబలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కురుబలకు అధిక ప్రాధాన్యమిచ్చారని, ఎంపీలుగా ఇద్దరిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించారని తెలిపారు.