అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ. 15 వేలు
NEWS Sep 27,2025 05:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. అక్టోబర్ 4వ తేదీన రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ వారి ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ప్రతి ఏడాది వీటిని ఇస్తామన్నారు. లబ్దిదారులైన 2,90,234 మంది ఆటో డ్రైవర్ల అకౌంట్లలో డబ్బులు పడతాయని తెలిపారు. ఒకవేళ జాబితాలో లేక పోతే వారిని పరిశీలించి జాబితాలో చేరుస్తామన్నారు. ఈ పథకానికి రూ. 435 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.