ఏపీలో 63.50 లక్షల మందికి పెన్షన్లు
NEWS Sep 27,2025 05:30 pm
సూపర్-6 పథకాలు, మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని ఫించన్లను మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. మొత్తంగా 63.50 లక్షల మందికి ఫించన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏడాదికి రూ.32,143 కోట్లు పెన్షన్ల నిమిత్తం తమ సర్కార్ ఖర్చు చేస్తోందన్నారు. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు, కేరళ రూ.7,295 కోట్లు పెన్షన్లు కింద ఖర్చు పెడుతున్నాయని తెలిపారు.