కేంద్ర మంత్రులు ఎక్కడ..?
NEWS Sep 27,2025 05:24 pm
గతంలో మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఒకరోజు రాత్రి నిద్ర చేశారని ఇప్పుడు మూసీ ముంచెత్తితే ఒక్కరు కూడా ఇటు వైపు చూడలేదని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇదే అంబర్ పేట నియోజకవర్గం ప్రజలు ఎన్నోసార్లు కిషన్ రెడ్డిని గెలిపించారని కానీ ఇప్పుడు ఆయన కన్నెత్తి చూడక పోవడం దారుణమన్నారు. ఇప్పుడు వచ్చి నిద్ర చేస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటో తెలుస్తాయన్నారు.