బాలకృష్ణ కామెంట్స్ అబద్దం
NEWS Sep 27,2025 05:20 pm
అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి. గత జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించ లేదని అన్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో అప్పటి సీఎం జగన్ ను కలిసిన వారిలో తాను కూడా ఉన్నానని పేర్కొన్నారు. చిరంజీవికి జగన్ ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు.పరిశ్రమ పెద్దగా ముఖ్యమంత్రితో మాట్లాడి సినీ ఇండస్ట్రీ సమస్యలను చిరంజీవి పరిష్కరించారని అన్నారు. తనను అవమానించారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ద్మమన్నారు.