ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్
NEWS Sep 27,2025 05:14 pm
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. 29న ఉదయం 11 గంటలకు విచారణ చేపడతామన్నారు స్పీకర్. ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ తి. ప్రకాశ్ గౌడ్, చింత ప్రభాకర్ వర్సెస్ కేల యాదయ్య, చింత ప్రభాకర్ వర్సెస్ గుడెం మహిపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కావాలని ఆదేశించారు. అక్టోబర్ 1 (బుధవారం) మరోసారి అదే కేసులపై విచారణ కొనసాగనుంది.