విద్యార్థులు వ్యసనాలకు బానిస కావద్దు
NEWS Sep 27,2025 05:09 pm
విద్యార్థులు వ్యసనాలకు బానిస కావద్దని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదట 1956 లో ఐటీఐలను ప్రారంభించారని, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని అప్ గ్రేడ్ చేయలేదన్నారు.